city times daily NOW AMP ⚡ Home
Telangana

ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధిని మరచి..కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదు

✍️ city times daily Reporter • 📅 Tuesday, 10 November 2026 08:36 PM

ముఖ్యమంత్రి రాష్ట్ర అభివృద్ధిని మరచి..కేటీఆర్‌పై వ్యక్తిగత విమర్శలు చేయడం తగదు

హామీల అమలుపై దృష్టి పెట్టాలని రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నాయకుడు లకావత్ గిరిబాబు హితవు

జూలూరుపాడు,సూర్య(మేజర్ న్యూస్)భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను వైరా నియోజకవర్గ బారాస పార్టీ నాయకుడు లకావత్ గిరిబాబు తీవ్రంగా ఖండించారు.ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్ర అభివృద్ధి,ప్రజా సంక్షేమం, ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సింది పోయి ప్రతిపక్ష నాయకుల వ్యక్తిగత రూపురేఖలు (బాడి షేమింగ్)పై వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.రాజకీయాల్లో విమర్శలు విధానాలు,అభిప్రాయాలు,ప్రజా సమస్యల ఆధారంగా ఉండాలే తప్ప వ్యక్తిగత దూషణలకు తావుండకూడదని గిరిబాబు అన్నారు.కేటీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక వ్యక్తిగత విమర్శలకు దిగడం ముఖ్యమంత్రి రాజకీయ అసహనానికి నిదర్శనమని పేర్కొన్నారు.సాధారణ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో విఫలమైందని గిరిబాబు ఆరోపించారు.వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే(డైవర్శన్ పాలిటిక్స్)వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.రైతు భరోసా,రుణమాఫీ,నిరుద్యోగులకు ఉద్యోగాల కల్పన,మహిళలకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని గిరిబాబు డిమాండ్ చేశారు.ప్రజలు ముఖ్యమంత్రి నుంచి కోరుకునేది వ్యక్తిగత విమర్శలు కాదని, రాష్ట్ర అభివృద్ధి,సంక్షేమం,ఎన్నికల హామీల అమలేనని లకావత్ గిరిబాబు స్పష్టం చేశారు. ఇప్పటికైనా వ్యక్తిగత విమర్శలను పక్కనపెట్టి ప్రజా సమస్యల పరిష్కారం రాష్ట్ర ప్రగతిపై దృష్టి సారించాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నేత లకావత్ గిరిబాబు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హితవు పలికారు.

 

Share this news:
WhatsApp Facebook X / Twitter