city times daily NOW AMP ⚡ Home
Telangana

రాష్ట్రంలో కరెంట్ కష్టాలకు చెక్: జెన్‌కోకు సింగరేణి కొండంత భరోసా!

✍️ city times daily Reporter • 📅 Tuesday, 10 November 2026 10:38 PM

!

 * థర్మల్ విద్యుత్ కేంద్రాలకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గు సరఫరాకు నిర్ణయం

 * నైనీ బ్లాక్ నుంచి యాదాద్రి ప్లాంట్‌కు రోజుకు 16 వేల టన్నుల బొగ్గు రవాణా

హైదరాబాద్, నవంబర్ 10 (సిటీటైమ్స్):

రాష్ట్రంలో రోజురోజుకూ పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ జెన్‌కో థర్మల్ కేంద్రాలకు రోజుకు 75 వేల టన్నుల బొగ్గును నిరంతరం సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించింది. ఉపముఖ్యమంత్రి, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశాల మేరకు సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి, జెన్‌కో సీఎండీ డాక్టర్ హరీష్ సంయుక్తంగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమన్వయ సమావేశంలో విద్యుత్ అవసరాలు, ఇంధన సరఫరాపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

నూతనంగా ప్రారంభమైన యాదాద్రి అల్ట్రా మెగా థర్మల్ విద్యుత్ కేంద్రానికి ఒడిశాలోని నైనీ బొగ్గు గని నుంచి ఈ నెలాఖరు నాటికి రోజుకు 16 వేల టన్నుల బొగ్గును రవాణా చేసేందుకు పక్కా ఏర్పాట్లు పూర్తి చేశారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల నుంచి డిమాండ్ పెరిగినా అదనపు బొగ్గును సమకూర్చేందుకు సిద్ధంగా ఉన్నామని, రెండు ప్రభుత్వ రంగ సంస్థల సమన్వయంతో రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని అధికారులు స్పష్టం చేశారు.

 

Share this news:
WhatsApp Facebook X / Twitter