city times daily NOW AMP ⚡ Home
Telangana

చెరువుకు పచ్చటి హారం.. పేదలకు ఇందిరమ్మ భరోసా: రేపే తమ్మిడికుంట ప్రారంభోత్సవం!

✍️ city times daily Reporter • 📅 Tuesday, 10 November 2026 10:02 PM

 

 * చెరువు అభివృద్ధిలో ఇళ్లు కోల్పోయిన పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పత్రాల అందజేత

 * అతిథిగా హాజరుకానున్న సినీ నటుడు నాగార్జున.. ఏర్పాట్లు పూర్తి చేసిన హైడ్రా

శేరిలింగంపల్లి, నవంబర్ 10 (సిటీటైమ్స్):

హైడ్రా ఆధ్వర్యంలో సర్వాంగ సుందరంగా పునరుద్ధరించిన మాదాపూర్‌లోని తమ్మిడికుంట చెరువును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభించనున్నారు. ఒకప్పుడు మురుగు, నిర్మాణ వ్యర్థాలతో దుర్గంధభరితంగా ఉన్న ఈ చెరువును 30 వేల ట్రక్కుల పూడిక తీసి 1.6 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, పచ్చదనంతో ఆహ్లాదకరంగా తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమానికి సినీ నటుడు అక్కినేని నాగార్జున గౌరవ అతిథిగా హాజరుకానున్నారు.

ఈ సందర్భంగా చెరువుల పరిరక్షణలో భాగంగా ఎఫ్‌టీఎల్ పరిధిలో ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులకు ప్రభుత్వం అండగా నిలవనుంది. రామంతాపూర్ పెద్ద చెరువు అభివృద్ధిలో గుడిసెలు కోల్పోయిన 34 మంది నిరుపేదలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేయనున్నారు. ప్రారంభోత్సవం అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తారు.

 

Share this news:
WhatsApp Facebook X / Twitter