మేడ్చల్ నియోజకవర్గ బీఆర్టీయూ అధ్యక్షునిగా ఎరుముల సురేష్
ఎమ్మెల్యేలు మల్లారెడ్డి,మర్రి రాజశేఖర్ రెడ్డిలను మర్యాదపూర్వకంగా కలిసిన నూతన అధ్యక్షుడు
మేడ్చల్ (సిటీ టైమ్స్) నవంబర్ 10:
మేడ్చల్ నియోజకవర్గ బీఆర్టీయూ అధ్యక్షునిగా ఎరుముల సురేష్ నియమితులయ్యారు.ఈ సందర్భంగా మేడ్చల్ జిల్లా బీఆర్టీయూ అధ్యక్షుడు సంబు ప్రభాకర్ ఆధ్వర్యంలో నూతన అధ్యక్షుడు ఎరుముల సురేష్ మంగళవారం మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి,మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిలను వారి నివాసాల్లో మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు సురేష్‌కు శుభాకాంక్షలు తెలియజేసి,శాలువాతో ఘనంగా సత్కరించారు. కార్మికులకు నిరంతరం అందుబాటులో ఉంటూ,వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
అనంతరం సంబు ప్రభాకర్ మాట్లాడుతూ.. కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాడే తత్వం,కార్మిక వర్గాల పట్ల మంచి అవగాహన ఉన్న నాయకుడు ఎరుముల సురేష్ అని పేర్కొన్నారు.ఆయన సేవలను గుర్తించి మేడ్చల్ నియోజకవర్గ బీఆర్టీయూ అధ్యక్షునిగా నియమించినట్లు తెలిపారు.నూతన అధ్యక్షుడు ఎరుముల సురేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ ముఖ్య నాయకులకు, తన నియామకానికి సహకరించిన కార్మిక సోదరులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.పార్టీ నాయకత్వం తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ కార్మికుల పక్షాన నిలబడి,వారి హక్కులు,న్యాయం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తానని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ భాస్కర్ యాదవ్,బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు సంబు ప్రభాకర్,నాయకులు చిన్న,యాదగిరి,సుధాకర్,శ్రీకాంత్ రెడ్డి,నవీన్,నారాయణ గౌడ్,మూర్తి,వెంకట్,రాకేష్ తదితరులు పాల్గొన్నారు.