• ఒకే గొడుగు కిందకు నాలుగు ప్రత్యేక విభాగాలు: ప్రారంభించిన డీజీపీ సీవీ ఆనంద్, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
శేరిలింగంపల్లి, నవంబర్ 10 (సిటీటైమ్స్):
మహిళలు, చిన్నారుల రక్షణను మరింత పటిష్టం చేసే దిశగా గచ్చిబౌలిలో అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మించిన మహిళా, శిశు భద్రతా విభాగం భవనాన్ని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్, స్థానిక ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కలిసి ఘనంగా ప్రారంభించారు. షీ-టీమ్స్, భరోసా కేంద్రం, మానవ అక్రమ రవాణా నిరోధక విభాగం సహా నాలుగు కీలక విభాగాలను ఒకే భవనం కిందకు తీసుకువచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
బాధితులకు తక్షణ న్యాయం, పోలీసు భరోసా కల్పించడమే తమ లక్ష్యమని డీజీపీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎం. రమేష్, నగరపాలక సంస్థ కమిషనర్ సృజనతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.