బ్రేకింగ్ న్యూస్
శాంతిభద్రతల ‘కొత్త పటం’!favorite rest article 771600Euro Girls Escort Guide: Premium Companionship in Dubai<description>Explore the top reputable online casinos in Canada, offering safe gaming, exciting games, and attractive bonuses. Discover your next gaming adventure!</description><description>Explore the best online casinos for Canadians. Find top-rated casinos, bonuses, games, and tips for a thrilling gambling experience in Canada.</description><description>Explore the diverse aspects that define the best Canadian, including culture, achievements, and the iconic figures that shape this beautiful country.</description><description>Discover the top gambling websites in Canada, offering exciting games, bonuses, and a safe gaming experience.</description><description>Explore Maleda Bet, a premier online betting platform offering a wide range of sports and casino games. Learn how to maximize your winnings and enjoy a seamless betting experience.</description>Casino Uden ROFUS: En Vej til Spil uden BegrænsningerWhales: Giants of the Oceanశాంతిభద్రతల ‘కొత్త పటం’!favorite rest article 771600Euro Girls Escort Guide: Premium Companionship in Dubai<description>Explore the top reputable online casinos in Canada, offering safe gaming, exciting games, and attractive bonuses. Discover your next gaming adventure!</description><description>Explore the best online casinos for Canadians. Find top-rated casinos, bonuses, games, and tips for a thrilling gambling experience in Canada.</description><description>Explore the diverse aspects that define the best Canadian, including culture, achievements, and the iconic figures that shape this beautiful country.</description><description>Discover the top gambling websites in Canada, offering exciting games, bonuses, and a safe gaming experience.</description><description>Explore Maleda Bet, a premier online betting platform offering a wide range of sports and casino games. Learn how to maximize your winnings and enjoy a seamless betting experience.</description>Casino Uden ROFUS: En Vej til Spil uden BegrænsningerWhales: Giants of the Ocean
తెలంగాణ

శాంతిభద్రతల ‘కొత్త పటం’!

నగర విస్తరణకు అనుగుణంగా పోలీస్‌ కమిషనరేట్ల పరిధుల పునర్వ్యవస్థీకరణ

• బేగంపేట జోన్‌ రద్దు.. ఉప్పల్‌ కేంద్రంగా కొత్త లా అండ్‌ ఆర్డర్‌ జోన్‌
• సైబరాబాద్‌, మల్కాజిగిరిలో జోన్లు, డివిజన్లు, ఠాణాల పరిధుల్లో మార్పులు

హైదరాబాద్‌, అక్టోబరు 1 (సిటీటైమ్స్‌):
విస్తరిస్తున్న మహానగరం.. మారుతున్న జనాభా, పెరుగుతున్న శివారు ప్రాంతాలకు అనుగుణంగా పోలీసింగ్‌ వ్యవస్థలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సైబరాబాద్‌, మల్కాజిగిరి కమిషనరేట్ల పరిధులను పునర్వ్యవస్థీకరిస్తూ హోంశాఖ జీవో ఎంఎస్‌ నంబర్లు 85, 86 జారీ చేసింది. గెజిట్‌ వెలువడిన వెంటనే కొత్త సరిహద్దులు అమల్లోకి వచ్చాయి. ప్రజలకు సత్వర పోలీస్‌ సేవలు అందించడం, ఠాణాల పరిధిపై ఉన్న గందరగోళాన్ని తొలగించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టారు.

సైబరాబాద్‌లో శేరిలింగంపల్లి, ఆర్సీపురం, నార్సింగి డివిజన్ల పరిధులు మారాయి. బొల్లారం మున్సిపాలిటీలోని 22 వార్డులు ఐడీఏ బొల్లారం ఠాణా పరిధిలోకి వచ్చాయి. ఎదులనగులపల్లి కొల్లూరు పరిధిలోకి, భెల్‌ న్యూ ఎంఐజీ కాలనీ ఆర్సీపురం పరిధిలోకి మారాయి. జన్వాడ, మిర్జాగుడా తదితర ప్రాంతాలు నార్సింగి ఠాణా పరిధిలోకి వెళ్లగా.. హైదర్‌షాకోట్‌, గందంగూడ, బైరాగిగూడ, పీరం చెరువు ప్రాంతాలు హైదరాబాద్‌ కమిషనరేట్‌లోని రాజేంద్రనగర్‌ జోన్‌కు బదిలీ అయ్యాయి.

మల్కాజిగిరిలో మాత్రం ప్రధాన మార్పు చోటుచేసుకుంది. బేగంపేట లా అండ్‌ ఆర్డర్‌ జోన్‌ను రద్దు చేసి.. ఉప్పల్‌ కేంద్రంగా కొత్త జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో అల్వాల్‌, ఉప్పల్‌, మేడిపల్లి లా అండ్‌ ఆర్డర్‌ డివిజన్లను, ప్రత్యేకంగా ఉప్పల్‌ ట్రాఫిక్‌ డివిజన్‌ను ఏర్పాటు చేశారు. జవహర్‌నగర్‌, కీసర, మల్కాజిగిరి తదితర ప్రాంతాల్లోని పలు ఠాణాల పరిధులను సవరించారు. మహిళా, ట్రాఫిక్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధుల్లోనూ మార్పులు చేశారు.

కొత్త సరిహద్దులు తక్షణమే అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు తమ ప్రాంతం ఏ ఠాణా పరిధిలోకి వచ్చిందో తెలుసుకుని, ఇకపై సంబంధిత పోలీస్‌ స్టేషన్‌లోనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.