రేవంత్ ప్రభుత్వంపై ఫిరాయింపు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
‘కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేదు.. పరిస్థితుల వల్ల తప్పలేదు’
హైదరాబాద్, ఆగస్టు 12: కాంగ్రెస్ ప్రభుత్వంపై బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను కాంగ్రెస్‌లో చేరడం అనవసరమైందని, కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం తనకు ఇష్టం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పరిణామాల కారణంగానే పార్టీ మారాల్సి వచ్చిందని తెలిపారు.
తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హామీ ఇవ్వడంతోనే కాంగ్రెస్ కండువా కప్పుకున్నానని పోచారం పేర్కొన్నారు. ఆరు నెలల్లో బాన్సువాడలో పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని సీఎం చెప్పారని, అందుకే పార్టీలో చేరినట్లు వివరించారు.
‘కేసీఆర్ వల్లే అభివృద్ధి’
బాన్సువాడ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధికి కేసీఆర్ కారణమని తానే చెబుతున్నానని పోచారం అన్నారు. తనకు అన్నం పెట్టిన వ్యక్తిని మరచిపోవడం కష్టమని పేర్కొన్నారు. కేసీఆర్‌ను మోసం చేసి పార్టీ మారడం ఇష్టం లేకపోయినా.. కొన్ని పరిస్థితుల కార
