గోపన్‌పల్లిలోని సోఫా కాలనీలో నియో చైతన్య హైస్కూల్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
శేరిలింగంపల్లి, ఆగస్టు 15 (సిటీటైమ్స్): శేరిలింగంపల్లి నియోజకవర్గం గోపన్‌పల్లిలోని సోఫా కాలనీ నియో చైతన్య హైస్కూల్లో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అతిథులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం విద్యార్థులు జాతీయ జెండాలతో వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశభక్తి గీతాలు, నృత్యాలు, నాటికలతో అలరించారు. జాతీయ జెండాలతో ర్యాలీలు, తిరంగా యాత్రలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు, వక్తలు స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. వారి త్యాగాల ఫలితంగానే దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిందని పేర్కొన్నారు. విద్యార్థులు క్రమశిక్షణ, దేశభక్తితో ఎదిగి దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
