దేశభక్తి స్ఫూర్తితో విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు
హైదరాబాద్, ఆగస్టు 15 (సిటీటైమ్స్): గచ్చిబౌలిలోని గోల్డ్క్రెస్ట్ పాఠశాలలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను దేశభక్తి స్ఫూర్తితో ఉత్సాహంగా నిర్వహించారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, జాతీయ గీతాలాపనతో వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు స్ఫూర్తిదాయక ప్రసంగాలు, దేశభక్తి గీతాలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. స్వేచ్ఛ, ఐక్యత, దేశభక్తి, బాధ్యతాయుత పౌరసత్వం వంటి విలువలను చాటిచెప్పేలా కార్యక్రమాలు సాగాయి. విద్యార్థులు, ఉపాధ్యాయుల కృషిని పాఠశాల యాజమాన్యం అభినందించింది. దేశ ఆదర్శాలను నిలబెట్టేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చింది. ‘ఐక్యత, సమగ్రత, దేశం పట్ల గర్వం’ అనే సందేశంతో వేడుకలు ముగిశాయి.
