బ్రేకింగ్ న్యూస్
బీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టుట్రాఫిక్‌ చిక్కులకు పరిష్కారమే లక్ష్యంచిన్నారులకు నిమ్స్‌లో ఉచిత గుండె శస్త్రచికిత్సలుసోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టుట్రాఫిక్‌ చిక్కులకు పరిష్కారమే లక్ష్యంచిన్నారులకు నిమ్స్‌లో ఉచిత గుండె శస్త్రచికిత్సలుసోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులు
తెలంగాణ

కేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతి

కేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతి

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత.. కేటీఆర్‌కు మేనమామ

 

హైదరాబాద్‌లో కార్యక్రమాలు రద్దు చేసుకున్న కేటీఆర్‌.. ఆస్పత్రికి హరీశ్‌రావు

 

హైదరాబాద్‌, ఆగస్టు 13: బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. ఆయన మృతి వార్తతో కేసీఆర్‌ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

 

జోగినపల్లి శ్రీనివాస్‌రావు.. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు స్వయాన మేనమామ. ఆయన మృతి విషయం తెలుసుకున్న కేటీఆర్‌ గురువారం హైదరాబాద్‌లో ముందుగా నిర్ణయించిన కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు ఆయన ఆస్పత్రికి వెళ్లనున్నట్లు తెలిసింది.

 

శ్రీనివాస్‌రావు మృతితో విషయం తెలుసుకున్న మాజీ మంత్రి హరీశ్‌రావు కూడా యశోద ఆస్పత్రికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నట్లు సమాచారం. శ్రీనివాస్‌రావు మృతికి పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

 

కుటుంబానికి తీరని విషాదం

 

కుటుంబ సభ్యులు, బంధువులకు శ్రీనివాస్‌రావు మృతి తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఆయన అంత్యక్రియలు ఎక్కడ, ఎప్పుడు నిర్వహించనున్నారనే వివరాలు కుటుంబ సభ్యుల నుంచి వెల్లడికావాల్సి ఉంది.