బ్రేకింగ్ న్యూస్
చందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టుచందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు
తెలంగాణ

గుంతలమయంగా మారిన ఆర్‌ అండ్‌ బీ రోడ్డు!

గుంతలమయంగా మారిన ఆర్‌ అండ్‌ బీ రోడ్డు!

మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌ నుంచి రావల్‌కోల్‌ కమాన్‌ వరకు అధ్వానం.. వాహనదారుల అవస్థలు

మేడ్చల్‌, ఆగస్టు 9 (సిటీటైమ్స్): మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌ వద్ద జాతీయ రహదారి-44 నుంచి కిష్టాపూర్‌ మీదుగా రావల్‌కోల్‌ కమాన్‌ వరకు ఉన్న ఆర్‌ అండ్‌ బీ రోడ్డు గుంతలమయంగా మారింది. రోడ్డుపై పెద్ద ఎత్తున గుంతలు ఏర్పడటంతో నిత్యం రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మార్గానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

మేడ్చల్‌ చెక్‌పోస్ట్‌ నుంచి కిష్టాపూర్‌ మీదుగా రాజీవ్‌ రహదారిని కలిపే ఈ లింక్‌ రోడ్డుపై పరిస్థితి అధ్వానంగా మారింది. ముఖ్యంగా చెక్‌పోస్ట్‌ నుంచి రావల్‌కోల్‌ కమాన్‌ వరకు గుంతలు ఎక్కువగా ఉండటంతో వాహనదారులు అప్రమత్తంగా ప్రయాణించాల్సి వస్తోంది. గుంతలను తప్పించుకునే క్రమంలో వాహనాలు అదుపుతప్పే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ప్రయాణం ఇబ్బందికరంగా మారిందని పలువురు వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయపడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. అధికారులు తక్షణమే స్పందించి రోడ్డును పరిశీలించాలని కోరారు.

గుంతలను పూడ్చడంతోపాటు అవసరమైన చోట పూర్తిస్థాయి మరమ్మతులు చేపట్టి రాకపోకలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆర్‌ అండ్‌ బీ అధికారులకు వాహనదారులు విజ్ఞప్తి చేశారు.