city times daily NOW AMP ⚡ Home
Telangana

భూమి నీ అబ్బజాగీరు కాదు. కూకట్పల్లిలో భూములు అమ్మకు.: ఎంపీ ఈటల రాజేందర్ 

✍️ city times daily Reporter • 📅 Tuesday, 10 November 2026 06:46 PM

సీఎం రియల్ ఎస్టేట్ బ్రోకర్ లాగా వ్యవహరిస్తున్నారు

చిన్న చిన్న ప్లాట్లు కూడా అమ్ముతున్నారు

రేవంత్ రెడ్డి ప్రగల్భాలు పలకడమే తప్ప చేస్తుంది వేరు. నీచంగా వ్యవహరిస్తున్నారు

నీవు ప్రోగ్రెసివ్ ముఖ్యమంత్రివా ? ప్రజలను హింస పెట్టడానికి ఉన్నావా ?

భూములను కాపాడలేక అమ్ముతున్నాం అని చెప్పడం అంటే నీది చేతకాని ప్రభుత్వం.

తెలంగాణ బ్యూరో, ప్రతినిధి: ప్రజా అవసరాల కోసం కేటాయించిన భూమిని హౌసింగ్ బోర్డ్ అన్యాయంగా వికరిస్తే విక్రయిస్తుందని ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. ఫోరం మాల్ ఎదురుగా ప్రజా అవసరాల కోసం కేటాయించిన స్థలాన్ని  ప్రజా ప్రయోజనాల కోసమే వినియోగించాలని డిమాండ్ చేస్తూ నిర్వహించిన ధర్నాలో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల అవసరాల కోసం కేటాయించిన స్థలాలను కాపాడాలని, వాటిని ప్రజా ప్రయోజనాలకే వినియోగించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
ముఖ్యమంత్రిగా ప్రజల ఆస్తులను కాపాడుతారని అనుకున్నాము కానీ..  నరకం చూపిస్తున్న ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడా చూడలేదు అని అన్నారు. 
భూములు నీ జాగీరు కాదు  
ప్రజలకు ఇల్లు కట్టిస్తామంటే రైతులు ఇచ్చిన భూమి ఇది. కూకట్ పల్లి హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏసియాలోని అతిపెద్దది 
పేదల కోసం ఈ హౌసింగ్ బోర్డ్ ఏర్పడింది అని అన్నారు. ఎకరానికి 2750 గజాల్లో మాత్రమే ఇల్లు కట్టాలి. కానీ కంచే చేను మేసినట్లు ప్రభుత్వం లేఔట్ చేశారు. కూకట్పల్లి అత్యధిక జనసాంద్రత ఉన్న కాలనీ.  ఇలాంటి ప్రాంతంలో మిగిలిన ప్లాట్లను అమ్ముకోవడం మూర్ఖపు ప్రభుత్వం జ్ఞానం లేని ప్రభుత్వం అని ఆరోపించారు. ప్రభుత్వ భూములను కాపాడేందుకు సుప్రీంకోర్టులో కూడా కొట్లాడుతున్నామని రేవంత్ రెడ్డి ప్రగల్ బాలు పలుకుతున్నారు కానీ ఇక్కడ చిన్న చిన్న ప్లాట్లను కక్కుర్తి పడి అమ్ముకుంటున్నారు అని ఆరోపించారు. 
రియల్ ఎస్టేట్ బ్రోకర్లు గా వ్యవహరిస్తున్నారు. ఒక వైపు ఫ్యూచర్ సిటీ అంటావు .. ఇంకో వైపు ఇలాంటి కాలనీలలో భూములు అమ్ముకుంటున్నారు. గుడి కోసం బడి కోసం ఉండే స్థలాలు ప్రజలకు ఉపయోగపడతాయి. మీ నాయకుల అండదండలు లేకుండా.. అధికారులు కబ్జాదారులు కుమ్మక్కు అవ్వకుండా భూములు కబ్జాకు గురికావు. 
ప్రజలు ఇప్పటికిప్పుడు నిన్ను తిట్టకపోవచ్చు కొట్టకపోవచ్చు కానీ ఇదా మా ప్రభుత్వం అని సిగ్గుతో తలదించుకుంటున్నారు ఓట్లు వేసిన వారే అసహ్యించుకుంటున్నారు. ఒకప్పుడు 30 లక్షలు నివాసం ఉన్న హైదరాబాదులో ఒక కోటి 70 లక్షల జనాభా అయ్యింది, ఇప్పటికే తాగే నీళ్లు లేవు రోడ్లు లేవు డ్రైనేజీలు లేవు అధ్వానంగా తయారయింది. పిల్లలు డ్రగ్స్ కి సెల్ ఫోన్స్ కి బానిసలు కాకుండా ఉండాలంటే డైవర్ట్ అవ్వడానికి పిల్లలకు ఆట స్థలాలు ఉండాలి  రేవంత్ రెడ్డి బేషజాలకు పోకండి బిజెపి వాళ్ళ ధర్నాగా భావించకండి ఇది ప్రజల ఆవేదన అని అర్థం చేసుకోండి. వినకపోతే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారు. విర్రవీగిన వారికి, ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకున్న వారికి ఇప్పటికే ఆ గతి పట్టింది అని అన్నారు. మేము గండిపేటకి, హైటెక్ సిటీ,నానక్రామ గూడలో భూములు అమ్మ వద్దు అని రావట్లేదు అడ్డుకుంటుంది అని అన్నారు. భూముల వేలానికి వ్యతిరేకంగా ఇక్కడ ప్రజలు చేస్తున్న ధర్నాకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాను అని అన్నారు.

 

Share this news:
WhatsApp Facebook X / Twitter