బ్రేకింగ్ న్యూస్
చందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టుచందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు
తెలంగాణ

స్కూల్‌లో ఉండాల్సిన బిడ్డ.. చెరువులో ఎలా?

స్కూల్‌లో ఉండాల్సిన బిడ్డ.. చెరువులో ఎలా?

తెల్లాపూర్‌లో ఐదేళ్ల బాలుడి మృతి.. యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని కాలనీవాసుల ఆరోపణ

పటాన్‌చెరు, ఆగస్టు 6 (సిటీటైమ్స్): స్కూల్‌కు వెళ్లిన ఐదేళ్ల చిన్నారి సమీపంలోని చెరువులో పడి మృతి చెందిన విషాద ఘటన సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్‌లో చోటుచేసుకుంది. పట్టణ పరిధిలోని శ్రీకారం వండర్‌ నెస్ట్‌ స్కూల్‌లో ఫస్ట్‌క్లాస్‌ చదువుతున్న షణ్ముఖ్‌ చెరువులో పడి ప్రాణాలు కోల్పోయాడు.

స్కూల్‌లో ఉండాల్సిన చిన్నారి బయటకు వెళ్లి సమీపంలోని చెరువు వద్దకు ఎలా చేరుకున్నాడనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని స్థానిక కాలనీవాసులు ఆరోపించారు. కుమారుడి మృతితో తల్లిదండ్రులు ఉదయ్‌కుమార్‌, మనీష తీవ్ర విషాదంలో మునిగిపోయారు.

సమాచారం అందుకున్న కొల్లూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేశారు. బాలుడి మృతికి దారితీసిన పరిస్థితులపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.