బ్రేకింగ్ న్యూస్
కొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుగోపన్‌పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుగోపన్‌పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
తెలంగాణ

బోనాల నిర్వహణకు 92 ఆలయాలకు రూ.30.71 లక్షలు

బోనాల నిర్వహణకు 92 ఆలయాలకు రూ.30.71 లక్షలు

శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (సిటీటైమ్స్): ఆషాఢ మాస బోనాల ఉత్సవాల నిర్వహణకు శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని 92 ఆలయాలకు ప్రభుత్వం రూ.30.71 లక్షల ఆర్థిక సహాయం మంజూరు చేసింది. ఈ నిధులను పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ ఆలయ ధర్మకర్తలకు అందజేశారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు బోనాలు ప్రతీకగా నిలుస్తాయని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని, ఇందులో శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని 92 ఆలయాలకు రూ.30.71 లక్షలు కేటాయించినట్లు తెలిపారు.

బోనాల సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్, భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో ఈవో సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్‌గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్‌రెడ్డి, ఆలయ ధర్మకర్తలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.