రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన యువతి.. సికింద్రాబాద్ కిమ్స్‌లో తుదిశ్వాస
రాజమహేంద్రవరం ఘటనలో తీవ్రంగా గాయపడిన వైద్య విద్యార్థిని ప్రియాంక చికిత్స పొందుతూ మృతి చెందారు. సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఆదివారం మధ్యాహ్నం 3.25 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రియాంక స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం ఏక్లాస్పూర్. ఎంబీబీఎస్ పూర్తి చేసిన ఆమె రాజమహేంద్రవరంలో పీజీ చదువుతున్నారు. ఈ నెల శుక్రవారం రాత్రి రాజమహేంద్రవరంలోని ప్రసాద్ ఆదిత్య మాల్ నుంచి ప్రియాంక తన స్నేహితుడితో కలిసి వాహనంపై వెళ్తుండగా.. దుష్యంత్, ఆండ్రూ అనే ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో కారు వేగంగా నడుపుతూ వారి వాహనాన్ని ఢీకొట్టినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో ప్రియాంక తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆమెను సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
