బ్రేకింగ్ న్యూస్
గచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుగోపన్‌పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలుదుర్గం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహంశాంతినగర్‌లో ఘనంగా బోనాల వేడుకలుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుగోపన్‌పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలుదుర్గం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహంశాంతినగర్‌లో ఘనంగా బోనాల వేడుకలు
తెలంగాణ

బోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక

బోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీక

IMG-20260809-WA0985

 

 

శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (సిటీటైమ్స్): తెలంగాణ రాష్ట్ర బోనాల పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని పలు దేవాలయాల్లో ఆలయ కమిటీల ఆహ్వానం మేరకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి వి. జగదీశ్వర్‌గౌడ్‌ స్థానిక ప్రజలు, నియోజకవర్గ నాయకులతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వర్‌గౌడ్‌ మాట్లాడుతూ.. అమ్మవారికి భక్తిశ్రద్ధలతో బోనం సమర్పించి, కుటుంబ సభ్యులతో పాటు సమాజం మొత్తం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని కోరుకోవడం బోనాల పండుగ ప్రత్యేకత అన్నారు. బోనాల సందర్భంగా మహిళలు సంప్రదాయ దుస్తుల్లో అమ్మవారికి బోనాలు సమర్పించడం, పోతురాజుల నృత్యాలు, డప్పుల మోతలు, భక్తుల సందడి తెలంగాణ సంస్కృతికి ప్రత్యేక శోభను తీసుకొస్తాయని పేర్కొన్నారు. బోనాల పండుగ తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల వైభవాన్ని చాటే వేడుకగా నిలుస్తుందని అన్నారు.