●



నల్లబెల్లి, ఆగస్టు 9 (సిటీటైమ్స్): తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పరామర్శించారు. నర్సంపేట నియోజకవర్గంలోని పెద్ది స్వగ్రామమైన నల్లబెల్లికి ఆదివారం చేరుకున్న కేసీఆర్‌కు బీఆర్ఎస్ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పెద్ది సుదర్శన్‌రెడ్డి నివాసానికి వెళ్లిన కేసీఆర్ తొలుత ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఆప్యాయంగా పలకరించి ఓదార్చారు. ‘నేను ఉన్నా.. చింత వద్దు’ అంటూ వారికి భరోసా ఇచ్చారు. అనంతరం పార్టీ తరఫున పెద్ది సుదర్శన్‌రెడ్డి ఇద్దరు పిల్లలకు చెరో రూ.కోటి చొప్పున, ఆయన తల్లి అమృతమ్మ బాగోగుల కోసం మరో రూ.25 లక్షల చెక్కులను అందించారు. దీంతో కుటుంబానికి మొత్తం రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్భంగా కేసీఆర్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పెద్ది సుదర్శన్‌రెడ్డి నిబద్ధతతో పనిచేస్తూ పార్టీ కోసం కృషి చేశారని, కేసీఆర్‌కు ముఖ్య అనుచరుడిగా కొనసాగారని బీఆర్ఎస్ శ్రేణులు పేర్కొన్నాయి. తన ఆప్తుడి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్ వారికి అండగా నిలిచారు. అనంతరం నల్లబెల్లి నుంచి ఎర్రవెల్లికి తిరుగు ప్రయాణమయ్యారు. కేసీఆర్ వెంట పార్టీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
