బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళిచిన్నారుల సమగ్ర వికాసానికి మరో ముందడుగుతెలంగాణ సాధనలో జయశంకర్‌ కృషి చిరస్మరణీయంబ్రతుకంతా తెలంగాణకే అంకితంతెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మాకొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!ఓటర్ల జాబితా సవరణపై సర్వపక్ష భేటీజయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలుపసిడి భగ్గుమంది!విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు?తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళిచిన్నారుల సమగ్ర వికాసానికి మరో ముందడుగుతెలంగాణ సాధనలో జయశంకర్‌ కృషి చిరస్మరణీయంబ్రతుకంతా తెలంగాణకే అంకితంతెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మాకొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!ఓటర్ల జాబితా సవరణపై సర్వపక్ష భేటీజయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలుపసిడి భగ్గుమంది!విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు?
తెలంగాణ

జయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు

జయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలు

శేరిలింగంపల్లి జోనల్‌ కార్యాలయంలో జయంతి వేడుకలు

నివాళులర్పించిన జోనల్‌ కమిషనర్‌ నారాయణ్‌ అమిత్‌

శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (సిటీటైమ్స్): తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ చేసిన మేధోపరమైన పోరాటం చిరస్మరణీయమని శేరిలింగంపల్లి జోనల్‌ కమిషనర్‌ నారాయణ్‌ అమిత్‌, ఐఏఎస్‌ అన్నారు. జయశంకర్‌ జయంతి సందర్భంగా గురువారం జోనల్‌ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తెలంగాణ ఉద్యమానికి జయశంకర్‌ అందించిన సిద్ధాంతాలు, చూపిన మార్గం స్ఫూర్తిదాయకమని నారాయణ్‌ అమిత్‌ పేర్కొన్నారు. ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అధికారులు, సిబ్బంది బాధ్యతతో పనిచేయాలని సూచించారు.

కార్యక్రమంలో శేరిలింగంపల్లి జోన్‌, సర్కిల్‌ పరిధిలోని అధికారులు, జోనల్‌ కార్యాలయ సిబ్బంది పాల్గొని జయశంకర్‌కు నివాళులర్పించారు.