బ్రేకింగ్ న్యూస్
చందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టుచందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు
జాతీయం

పసిడి భగ్గుమంది!

పసిడి భగ్గుమంది!

10 గ్రాముల మేలిమి బంగారంపై రూ.2,890 పెరుగుదల

22 క్యారెట్ల బంగారం రూ.1.37 లక్షలు దాటింది

కిలో వెండి రూ.2.40 లక్షల వద్ద కొనసాగింపు

హైదరాబాద్‌: బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములపై రూ.2,890 పెరిగి రూ.1,49,730కి చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.2,650 ఎగబాకి 10 గ్రాములకు రూ.1,37,250గా నమోదైంది.

అంతర్జాతీయ మార్కెట్‌లో పరిణామాలు, ఆర్థిక అనిశ్చితుల ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. తాజా పెరుగుదలతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.50 లక్షల మార్కుకు చేరువైంది.

బంగారం ధర భారీగా పెరిగినప్పటికీ వెండి ధరలో మాత్రం మార్పు లేదు. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో కిలో వెండి రూ.2.40 లక్షల వద్ద కొనసాగుతోంది.