బ్రేకింగ్ న్యూస్
కొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుగోపన్‌పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుగోపన్‌పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
తెలంగాణ

విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు?

విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు?

ఆగస్టు 8న రెండో శనివారం.. 9న ఆదివారం

10న బోనాలకు సెలవిస్తే వరుసగా మూడు రోజులు

అధికారిక ప్రకటన వెలువడితేనే స్పష్టత

హైదరాబాద్‌: విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు వచ్చే అవకాశం ఉంది. ఆగస్టు 8న రెండో శనివారం, 9న ఆదివారం కావడంతో పాఠశాలలకు సాధారణ సెలవులు ఉంటాయి. ఆగస్టు 10న బోనాల సందర్భంగా ప్రభుత్వం స్థానిక సెలవు ప్రకటిస్తే.. విద్యార్థులకు వరుసగా మూడు రోజుల విరామం లభించనుంది. హైదరాబాద్‌లో బోనాల ఉత్సవాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఏటా బోనాల సందర్భంగా హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో స్థానికంగా సెలవు ప్రకటించే సందర్భాలున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 10న కూడా సెలవు ప్రకటించే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రభుత్వం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడాల్సి ఉంది. ఆగస్టు 10న సెలవు ఖరారైతే రెండో శనివారం, ఆదివారంతో కలిపి మూడు రోజుల పాటు విద్యాసంస్థలు మూతపడనున్నాయి. అయితే ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం ప్రకటించే వరకు మూడు రోజుల సెలవులు ఖరారైనట్లు భావించరాదు.