ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరాలి.. బీజేపీ నేత డాక్టర్ అజిత్‌కుమార్ సేనాపతి పిలుపు
శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (సిటీటైమ్స్): హఫీజ్‌పేట డివిజన్‌లో ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సన్నాహక సమావేశం నిర్వహించారు. హుడా కాలనీలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, ‘హర్ ఘర్ తిరంగా’ కన్వీనర్ డాక్టర్ అజిత్‌కుమార్ సేనాపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఆగస్టు 10 నుంచి 15 వరకు చేపట్టనున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమాన్ని ప్రతి బూత్‌లో, ప్రతి ఇంటికీ చేరేలా కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని డాక్టర్ అజిత్‌కుమార్ సేనాపతి పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరేసేలా ప్రజల్లో దేశభక్తి భావాన్ని పెంపొందించేందుకు విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని సూచించారు. డివిజన్ స్థాయి నుంచి బూత్ స్థాయి వరకు నాయకులు, కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యతను తీసుకోవాలని కోరారు.
సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు దేవాల్ యాదవ్, రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ కార్యవర్గ సభ్యుడు రవి గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఆళ్ల వరప్రసాద్, సీనియర్ నాయకురాలు పార్వతి, నాయకులు పవన్, డివిజన్ ప్రధాన కార్యదర్శి మారేళ్ల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు ప్రసాద్ పాత్రో, రాజు యాదవ్, మహిళా మోర్చా అధ్యక్షురాలు నిర్మలా, కార్యదర్శి చుక్క శ్రీను, సుబ్బారావు, బీజేవైఎం డివిజన్ ప్రధాన కార్యదర్శి బాలరాజు, నాయకులు మోహన్ ముదిరాజ్, నవీన్, రామచంద్ర యాదవ్, శేఖర్ ముదిరాజ్, రాంరెడ్డి, అశోక్ ముదిరాజ్, స్వామి, సాయి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
