బ్రేకింగ్ న్యూస్
చందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టుచందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు
తెలంగాణ

జయలక్ష్మికి రూ.4 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం

జయలక్ష్మికి రూ.4 లక్షల సీఎంఆర్‌ఎఫ్‌ సాయం

సీఎంఆర్‌ఎఫ్‌-ఎల్‌ఓసీ మంజూరుపత్రం అందజేసిన పీఏసీ చైర్మన్‌ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి (సిటీటైమ్స్): అత్యవసర వైద్య చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న శేరిలింగంపల్లి డివిజన్‌ పాపిరెడ్డికాలనీకి చెందిన జయలక్ష్మికి రూ.4 లక్షల ఆర్థిక సాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన సీఎంఆర్‌ఎఫ్‌-ఎల్‌ఓసీ మంజూరుపత్రాన్ని పీఏసీ చైర్మన్‌ ఆరెకపూడి గాంధీ బాధిత కుటుంబానికి అందజేశారు. తాజా మాజీ కార్పొరేటర్‌ దొడ్ల వెంకటేష్‌ గౌడ్‌తో కలిసి ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు అండగా నిలుస్తోందన్నారు. అనారోగ్యంతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే నిరుపేదలకు సీఎంఆర్‌ఎఫ్‌ ఆపన్నహస్తంగా నిలుస్తోందని పేర్కొన్నారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేదల పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని అన్నారు.

వైద్య చికిత్సకు ఆర్థిక సాయం అందేలా సహకరించిన ఆరెకపూడి గాంధీకి బాధిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నాయకులు మంత్రి ప్రగడ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.