మాదాపూర్, ఆగస్టు 9 (సిటీటైమ్స్): దుర్గం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. శనివారం సాయంత్రం సుమారు 7.30 గంటల సమయంలో లేక్ పీసీ శ్రీశైలం నుంచి సమాచారం అందడంతో బ్లూకోల్ట్స్ సిబ్బంది, సబ్ ఇన్స్పెక్టర్ ఘటనాస్థలానికి చేరుకున్నారు. హైడ్రా సిబ్బంది సహాయంతో చెరువులోని నీటి నుంచి మృతదేహాన్ని వెలికితీశారు. మృతురాలి వయస్సు సుమారు 20 నుంచి 25 ఏళ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆమె ఎరుపు రంగు లెగ్గింగ్స్, తెల్లటి చుక్కలున్న నీలిరంగు టాప్ ధరించి ఉన్నట్లు గుర్తించారు. మృతురాలి వివరాలు లేదా ఆచూకీ తెలిసిన వారు మాదాపూర్ పోలీస్‌స్టేషన్ సెల్ నంబర్ 8712663109కు, మాదాపూర్ ఎస్హెచ్ఓ కె.వి. సుబ్బారావు సెల్ నంబర్ 8712663100కు లేదా మాదాపూర్ ఎస్ఐ సీహెచ్. సంతోష్‌కుమార్ మొబైల్ నంబర్ 8712554121కు సమాచారం అందించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.
దుర్గం చెరువులో గుర్తుతెలియని మహిళ మృతదేహం
