బ్రేకింగ్ న్యూస్
చందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టుచందానగర్‌లో ఐదేళ్ల బాలుడు అదృశ్యందేశభక్తి చాటిన చిన్నారులుగోల్డ్‌క్రెస్ట్‌ పాఠశాలలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలుబీసీల రాజకీయ సార్వభౌమత్వమే టీఆర్పీ లక్ష్యంకేసీఆర్‌ బావమరిది జోగినపల్లి శ్రీనివాస్‌రావు మృతిశస్త్రచికిత్సలో సరికొత్త డిజిటల్‌ అడుగువరంగల్‌లో 217 గ్రామాలకు మొబైల్‌ కనెక్టివిటీకోదండరాంకు నిరుద్యోగుల నిరసన సెగఅనవసరంగా కాంగ్రెస్‌లో చేరానుహెచ్‌సీయూలో గంజాయి కేసు.. పరారీలో ఉన్న నిందితుడి అరెస్టు
తెలంగాణ

శాంతినగర్‌లో ఘనంగా బోనాల వేడుకలు

శాంతినగర్‌లో ఘనంగా బోనాల వేడుకలు

• తొట్టెల కార్యక్రమంలో సీపీఎం నాయకుడు కొంగరి కృష్ణ ముదిరాజ్‌.. కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు

 

శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (సిటీటైమ్స్): శేరిలింగంపల్లి మండల పరిధిలోని మదీనాగూడ డివిజన్‌ శాంతినగర్‌లో ఆదివారం ఆషాఢ మాస బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి బోనాలు సమర్పించారు. అనంతరం సంప్రదాయబద్ధంగా తొట్టెల కార్యక్రమాన్ని నిర్వహించారు. తొట్టెల కార్యక్రమంలో సీపీఎం పార్టీ నాయకుడు కొంగరి కృష్ణ ముదిరాజ్‌ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు, రైతులు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. బోనాల వేడుకల సందర్భంగా శాంతినగర్‌లో పండుగ సందడి నెలకొంది. తొట్టెల కార్యక్రమంతోపాటు పోతురాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని వేడుకల్లో భాగస్వాములయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.