city times daily NOW AMP ⚡ Home
Telangana

సాగుకు24 గంటల విద్యుత్ ఇవ్వాలి

✍️ city times daily Reporter • 📅 Tuesday, 10 November 2026 07:00 PM

దుమ్ముగూడెం  న్యూస్:: వ్యవసాయ రంగానికి అంతరాయం లేకుండా 24 గంటల విద్యుత్ సరఫరా చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎలమంచి వంశీకృష్ణ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని తురుబాకలో ఏఐకేఎస్ జాతీయ మహాసభల ప్రచారంలో భాగంగా రైతు సంఘం జెండాను సీనియర్ నాయకులు బొల్లి నాగేశ్వరరావు ఆవిష్కరించారు.ఈ సందర్భంగా జరిగిన సభలో వంశీకృష్ణ మాట్లాడుతూ..మరమ్మతుల పేరుతో పగటిపూట విద్యుత్ కోతలు విధిస్తున్నారని, ఆటో స్టార్టర్లు వాడొద్దనడంతో రైతులు మోటార్ల వద్దే కాపలా కాయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాత్రివేళల్లోనూ కనీసం 4 గంటలు విద్యుత్ ఇవ్వాలని దాళ్వా పంటలకు అధికారులు సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి బొల్లి సత్యనారాయణ,వ్యవసాయ కార్మిక సంఘం కార్యదర్శి మర్మం చంద్రయ్య,ఉపసర్పంచ్ వై.మల్లారెడ్డి,నాయకులు బిల్లా ముత్యాలరావు,సతీష్,వెంకన్న తదితరులు పాల్గొన్నారు

 

Share this news:
WhatsApp Facebook X / Twitter