హమాలి రేట్లు పెరుగుదల
ఇల్లందు రూరల్: పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా హమాలీ రేట్లు పెంచడం జరిగిందని ఎఫ్ టి యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జే. సీతారామయ్య, తెలంగాణ హమాలి అండ్ మిల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొక్కు సారంగపాణి జిల్లా అధ్యక్షులు పందిర్లపల్లి వీరన్న అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వ్యాపారస్తులకు, ప్రతినిధులకు మధ్య జరిగినటువంటి ఈ చర్చలు సఫలం కావడంతో వేతన ఒప్పందం కుదిరినట్లు పేర్కొన్నారు.ఈ ఒప్పందం 2027 అక్టోబర్ 31 వరకు అమలులో ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కొప్పుల శ్రీనివాస్, ఐఎఫ్టియు రాష్ట్ర నాయకులు తోడేటి నాగేశ్వరరావు, జిల్లా నాయకులు నారాటి
వెంకన్న, ఇల్లందు ఏరియా కమిటీ అధ్యక్షులు రావూరి ఉపేందర్ రావు, హమాలీ ప్రతినిధులు తొండల సర్వయ్య, ఐలు ఉప్పలయ్య, చిత్తారి వెంకన్న, పూణేం లక్ష్మణ్, మూతి కోటేశ్వరరావు, శ్రీకాంత్, మోహన్, నరేష్ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.