city times daily NOW AMP ⚡ Home
Telangana

పట్టుదలతో చదివి ఉద్యోగాలు సాధించాలి

✍️ city times daily Reporter • 📅 Tuesday, 10 November 2026 07:43 PM

- పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణతో పాటు స్టడీ మెటీరియల్ పంపిణీ
- జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

కొత్తగూడెం పట్టుదలతో చదివి, శారీరకంగా దారుడ్యంతో ఉద్యోగాలు సాధించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. పోలీస్ శాఖ, సింగరేణి సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల ఉచిత శిక్షణ తరగతులకు ఆయన హాజరై అభ్యర్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ ఉద్యోగాల సాధనకు క్రమశిక్షణ, పట్టుదల, నిరంతర సాధన ఎంతో అవసరమని తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత శిక్షణ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని, అధ్యాపకులు అందించే సూచనలు పాటిస్తూ ప్రణాళికాబద్ధంగా చదవాలని అభ్యర్థులకు సూచించారు. పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు సమయపాలనతో పాటు నిరంతర సాధన అలవర్చుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్దేశించుకొని కష్టపడి చదివి పోలీస్ ఉద్యోగాన్ని సాధించే దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖ, సింగరేణి సంస్థ సంయుక్తంగా అందిస్తున్న ఈ శిక్షణ ద్వారా అభ్యర్థులు మంచి ఫలితాలు సాధించి పోలీస్ శాఖలో ఉద్యోగాలు పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ ఇ. శ్రీనివాస్, ఆర్‌ఐ ఆపరేషన్స్ బి. రవి, ఆర్ఐ వెల్ఫేర్ కృష్ణారావు, అధ్యాపక బృందం, పోలీస్ అధికారులు, శిక్షణ పొందుతున్న అభ్యర్థులు పాల్గొన్నారు.

 

Share this news:
WhatsApp Facebook X / Twitter