బ్రేకింగ్ న్యూస్
సోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుసోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు
తెలంగాణ

బ్రతుకంతా తెలంగాణకే అంకితం

బ్రతుకంతా తెలంగాణకే అంకితం

• హఫీజ్‌పేట్‌లో ఆచార్య జయశంకర్‌ జయంతి సందర్భంగా నివాళులు

శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (సిటీటైమ్స్): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జీవితాంతం కృషి చేసిన మహనీయుడు ఆచార్య కొత్తపల్లి జయశంకర్‌ అని హఫీజ్‌పేట్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్‌ అన్నారు. జయశంకర్‌ జయంతి సందర్భంగా గురువారం హుడా కేఫ్‌ వద్ద ఆయన విగ్రహానికి బీజేపీ నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు.దశాబ్దాల తెలంగాణ ఉద్యమానికి జయశంకర్‌ దిశానిర్దేశం చేశారని నాయకులు గుర్తుచేశారు. ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు తెలంగాణ ఉద్యమానికి సిద్ధాంతపరమైన పునాది వేశారని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ తెలంగాణ అభివృద్ధికి కృషి చేయాలని జితేందర్‌ కోరారు.కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ అజిత్‌కుమార్‌ సేనాపతి, సీనియర్‌ నాయకుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్‌ రమణయ్య, రవిగౌడ్‌, ఆళ్ల వరప్రసాద్‌, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.