10 గ్రాముల మేలిమి బంగారంపై రూ.2,890 పెరుగుదల
22 క్యారెట్ల బంగారం రూ.1.37 లక్షలు దాటింది
కిలో వెండి రూ.2.40 లక్షల వద్ద కొనసాగింపు
హైదరాబాద్: బులియన్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా పెరిగింది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాములపై రూ.2,890 పెరిగి రూ.1,49,730కి చేరింది. 22 క్యారెట్ల ఆభరణాల బంగారం ధర రూ.2,650 ఎగబాకి 10 గ్రాములకు రూ.1,37,250గా నమోదైంది.
అంతర్జాతీయ మార్కెట్‌లో పరిణామాలు, ఆర్థిక అనిశ్చితుల ప్రభావంతో దేశీయంగా పసిడి ధరలు పెరుగుతున్నాయి. తాజా పెరుగుదలతో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1.50 లక్షల మార్కుకు చేరువైంది.
బంగారం ధర భారీగా పెరిగినప్పటికీ వెండి ధరలో మాత్రం మార్పు లేదు. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.2.40 లక్షల వద్ద కొనసాగుతోంది.
