- పోచమ్మ తల్లిని దర్శించుకున్న మాజీ జడ్పీటీసీ సాయిపేట శ్రీనివాస్, డివిజన్ అధ్యక్షుడు సురేందర్
మేడ్చల్, ఆగస్టు 9 (సిటీటైమ్స్): గుండ్లపోచంపల్లి డివిజన్ పరిధిలోని సుతారిగూడలో ఆదివారం ఆషాఢ మాస బోనాల ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గుండ్లపోచంపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ సాకరబోయిన మల్లేష్ ముదిరాజ్ ఆధ్వర్యంలో డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు సురేందర్ ముదిరాజ్, మాజీ జడ్పీటీసీ సాయిపేట శ్రీనివాస్, మాజీ సర్పంచ్ బండారి నరేందర్ ముదిరాజ్ తదితరులు పోచమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో గుండ్లపోచంపల్లి డివిజన్ ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని పోచమ్మ తల్లిని వేడుకున్నట్లు తెలిపారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురిసి, రైతుల పాడి పంటలు బాగా పండి అధిక దిగుబడులు సాధించాలని ఆకాంక్షించారు.
- కార్యక్రమంలో నాయకులు చింతల భాస్కర్ ముదిరాజ్, సురేందర్‌రెడ్డి, కావలి భాస్కర్, కిషన్, చింతల జైహింద్, చింతల వెంకటేష్, చింతల హరిబాబు, చింతల రాజు, లబ్దిపిర్ల వినోద్ గౌడ్, షబ్బీర్, ప్రవీణ్‌కుమార్, నట్టి సాయి, సాకరబోయిన సాయికుమార్, చింతల లక్ష్మణ్, చిల్ల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
