• దేవునిగుట్టపై వైభవంగా ప్రారంభమైన ఉత్సవాలు.. ప్రత్యేక పూజలు, బోనాలతో మొక్కులు చెల్లించిన భక్తులు
శేరిలింగంపల్లి, ఆగస్టు 9 (సిటీటైమ్స్): గోపన్‌పల్లిలోని దేవునిగుట్టపై కొలువైన పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం వివిధ రకాల పుష్పాలు, ఆభరణాలతో అమ్మవారిని అలంకరించి నైవేద్యం సమర్పించారు. భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. బోనాల సందర్భంగా స్థానిక భక్తులు కోడిపుంజులు, మేకపోతులను బలివ్వడంతోపాటు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో మాజీ కార్పొరేటర్ గంగాధర్‌రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు రవీంద్ర ప్రసాద్ దూబే, ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్, కోశాధికారి నరసింహ, కార్యదర్శులు నర్సింగరావు, పోచయ్య, సభ్యులు సత్యనారాయణ, రాజేందర్, రాజకిరణ్ దూబే, రంగస్వామి, అంజయ్యతో పాటు స్థానిక భక్తులు పాల్గొన్నారు.
