పాలకుర్తి, ఆగస్టు 16(సిటీ టైమ్స్)

పాలకుర్తి మండల కేంద్రంలోని రెండు పోచమ్మ ఆలయాల్లో నిర్వహించిన బోనాల ఉత్సవాల్లో రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బోనం ఎత్తుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీర్వాదం తీసుకున్నారు.అమ్మవారి కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని మాజీ మంత్రి ఆకాంక్షించారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాల వద్ద భక్తుల సందడి నెలకొంది. ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం నాయకులు, సామాజిక మాధ్యమాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
