బ్రేకింగ్ న్యూస్
కొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుగోపన్‌పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుగోపన్‌పల్లిలో ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు
తెలంగాణ

బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న కారు.. ఇద్దరు మృతి

ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై ప్రమాదం.. అతివేగంతో అదుపుతప్పిన తవేరా

శేరిలింగంపల్లి, ఆగస్టు 8 (సిటీటైమ్స్): ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై తవేరా కారు అదుపుతప్పి బ్రిడ్జి పిల్లర్‌ను ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. శనివారం అర్ధరాత్రి 12.25 గంటల సమయంలో డంపింగ్‌ యార్డ్‌, నియో పోలీస్‌ బ్రిడ్జి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.

పోలీస్ ల వివరం ప్రకారం.. కొల్లూరులోని ఇంద్రారెడ్డినగర్‌లో నివసించే కనైయాలాల్‌ (25), దేరామ్‌ (24) టైల్స్‌ పనులు చేస్తుంటారు. రాజస్థాన్‌కు చెందిన వీరిద్దరూ ఇంద్రారెడ్డినగర్‌ నుంచి నానక్‌రామ్‌గూడలోని సత్వాకు ఏపీ01ఏబీ2232 నంబరు తవేరా కారులో బయలుదేరారు. కారును కనైయాలాల్‌ నడుపుతున్నాడు.

డంపింగ్‌ యార్డ్‌ సమీపంలోని ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డుపై కారు అతివేగంగా వెళ్తుండగా అదుపుతప్పి నియో పోలీస్‌ బ్రిడ్జి పిల్లర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కనైయాలాల్‌, దేరామ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. ఇతర వాహనం ప్రమేయం లేకుండా జరిగిన స్వయం ప్రమాదంగా పోలీసులు పేర్కొన్నారు.