బ్రేకింగ్ న్యూస్
సోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలుసోమవారం.. కీసరగుట్టకు పోటెత్తిన భక్తులుకొండాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతిమానవత్వం చాటుకున్న 2004 బ్యాచ్‌ స్నేహితులుగచ్చిబౌలి గర్జించింది.. గిన్నిస్‌ మోగింది!సామాజిక చరిత్ర నిర్మాతలు మనుషులే: భాస్కర్‌శేరిలింగంపల్లిలో ఘనంగా బోనాల వేడుకలుపెద్ది కుటుంబానికి కేసీఆర్‌ భరోసాచికిత్స పొందుతూ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతిబోనాల పండుగకు ప్రత్యేక శోభ.. తెలంగాణ సంస్కృతికి ప్రతీకతెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు
తెలంగాణ

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం.. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

ఎస్సీ, ఎస్టీల సంక్షేమం.. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి

కాలనీల్లో మౌలిక వసతులు, ఉపాధి అవకాశాలపై సమీక్ష

రిజర్వేషన్లు, బ్యాక్‌లాగ్ ఖాళీలు, రోస్టర్ అమలుపైనా ఆరా

సంక్షేమ ఫలాలు అర్హులకు చేరేలా చర్యలు చేపట్టాలి: బక్కి వెంకటయ్య

సైబరాబాద్, ఆగస్టు 5 (సిటీటైమ్స్): ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమం, వారి ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధితో పాటు విద్య, ఉపాధి అవకాశాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు సూచించారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఈ వర్గాలకు అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై సీఎంసీ కమిషనర్, అన్ని జోన్ల కమిషనర్లు, వివిధ శాఖల విభాగాధిపతులు, సంబంధిత అధికారులతో బుధవారం ఆయన సమీక్ష నిర్వహించారు.

ప్రత్యేక సబ్‌ప్లాన్‌ల ద్వారా ఎస్సీ, ఎస్టీ కాలనీల అభివృద్ధి, శ్మశాన వాటికల్లో అవసరమైన సదుపాయాల కల్పన, అప్రోచ్ రోడ్ల ఏర్పాటు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్ల అభివృద్ధిపై సమావేశంలో చర్చించారు. వీధి వ్యాపారులకు సహాయం, పారిశుధ్య కార్మికులకు పీపీఈ కిట్లు, బీమా సదుపాయం, శాశ్వత, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు ఆరోగ్య బీమా కల్పన అంశాలనూ సమీక్షించారు. విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు ఎస్సీ, ఎస్టీల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు అంశంపైనా దృష్టి సారించారు.

అభివృద్ధి పనులు, టెండర్లలో అమలు చేయాల్సిన రిజర్వేషన్ నిబంధనలు, బ్యాక్‌లాగ్ ఖాళీలు, రోస్టర్ విధానం, ఆర్థిక కేటాయింపులపైనా అధికారులు సమీక్షించారు. నిబంధనల అమలులో లోపాలకు తావులేకుండా చూడాలని, శాఖల మధ్య సమన్వయంతో పాటు పర్యవేక్షణను పటిష్ఠం చేయాలని సూచించారు.

సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కాగితాలకే పరిమితం కాకుండా వాటి ప్రయోజనాలు అర్హులైన లబ్ధిదారులకు సమర్థంగా చేరేలా చర్యలు చేపట్టాలని బక్కి వెంకటయ్య స్పష్టం చేశారు. సమావేశంలో చర్చించిన అంశాలు, చేసిన సూచనలను సంబంధిత శాఖలు పరిశీలించి, పరస్పర సమన్వయంతో అవసరమైన తదుపరి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.