అన్నపురెడ్డిపల్లి: పేద బాధిత కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తుందని కాంగ్రెస్ పార్టీ మండల యువజన అధ్యక్షుడు వేముల నరేష్ బాబు అన్నారు. మంగళవారం ఆయన  మండల పరిధిలోని పెద్దిరెడ్డిగూడెం పంచాయతీ పాత బూర్గూడె  గ్రామానికి చెందిన సింగిశాల ఈశ్వరి కి 16 వేల రూపాయల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న బాధితులకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆర్థిక సహాయం అందుతుందని, ఆర్థిక సహాయంతో బాధిత కుటుంబాలు ఎంతో సంతోషపడుతున్నారని, ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనారోగ్య బాధితులు ఎవరు అధైర్య పడవద్దని, ఎమ్మెల్యే జారే ఆదినారాయణ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎల్లప్పుడు వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును అందేలా కృషిచేసిన మండల నాయకులకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు వేముల రమణ, మైనార్టీ నాయకులు, యువజన నాయకులు, తదితరులు ఉన్నారు.