బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళిచిన్నారుల సమగ్ర వికాసానికి మరో ముందడుగుతెలంగాణ సాధనలో జయశంకర్‌ కృషి చిరస్మరణీయంబ్రతుకంతా తెలంగాణకే అంకితంతెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మాకొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!ఓటర్ల జాబితా సవరణపై సర్వపక్ష భేటీజయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలుపసిడి భగ్గుమంది!విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు?తెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళిచిన్నారుల సమగ్ర వికాసానికి మరో ముందడుగుతెలంగాణ సాధనలో జయశంకర్‌ కృషి చిరస్మరణీయంబ్రతుకంతా తెలంగాణకే అంకితంతెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మాకొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!ఓటర్ల జాబితా సవరణపై సర్వపక్ష భేటీజయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలుపసిడి భగ్గుమంది!విద్యార్థులకు వరుసగా మూడు రోజుల సెలవులు?
తెలంగాణ

కొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!

కొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!

కొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!

ఆగస్టు 15 నుంచి అర్హులకు పంపిణీ

119 నియోజకవర్గాల్లో ఒకేసారి కార్యక్రమం

సంగారెడ్డిలో ప్రారంభించనున్న సీఎం రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌: కొత్త తెల్ల రేషన్‌ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి కీలక సమాచారం. ఆగస్టు 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అర్హులకు కొత్త కార్డులు అందజేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒకేసారి పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్వహించే కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లబ్ధిదారులకు కొత్త రేషన్‌ కార్డులు అందజేసి పంపిణీని ప్రారంభించనున్నారు. అదే సమయంలో ఆయా నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో అర్హులకు కార్డులు అందించనున్నారు.

అర్హులైన పేద కుటుంబాలు సంక్షేమ పథకాలకు దూరం కాకుండా కొత్త రేషన్‌ కార్డులు అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులందరికీ కార్డులు అందిస్తామని తెలిపారు. రేషన్‌ కార్డుల ద్వారా ప్రజాపంపిణీ వ్యవస్థ ప్రయోజనాలతో పాటు నిబంధనల మేరకు వివిధ సంక్షేమ పథకాలను పొందేందుకు అవకాశం ఉంటుంది.