బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఘన నివాళితెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళిచిన్నారుల సమగ్ర వికాసానికి మరో ముందడుగుతెలంగాణ సాధనలో జయశంకర్‌ కృషి చిరస్మరణీయంబ్రతుకంతా తెలంగాణకే అంకితంతెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మాకొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!ఓటర్ల జాబితా సవరణపై సర్వపక్ష భేటీజయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలుపసిడి భగ్గుమంది!తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఘన నివాళితెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళిచిన్నారుల సమగ్ర వికాసానికి మరో ముందడుగుతెలంగాణ సాధనలో జయశంకర్‌ కృషి చిరస్మరణీయంబ్రతుకంతా తెలంగాణకే అంకితంతెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మాకొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!ఓటర్ల జాబితా సవరణపై సర్వపక్ష భేటీజయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలుపసిడి భగ్గుమంది!
తెలంగాణ

చిన్నారుల సమగ్ర వికాసానికి మరో ముందడుగు

చిన్నారుల సమగ్ర వికాసానికి మరో ముందడుగు

2029 వరకు దివీస్‌ ఫౌండేషన్‌–యునిసెఫ్‌ ఇండియా భాగస్వామ్యం

మాదాపూర్, ఆగస్టు 6 (సిటీటైమ్స్): చిన్నారుల్లో ఎదుగుదల లోపాలు, వైకల్యాలను తొలిదశలోనే గుర్తించి సకాలంలో అవసరమైన సేవలు అందించేందుకు దివీస్‌ ఫౌండేషన్‌ ఫర్‌ గిఫ్టెడ్‌ చిల్డ్రన్‌ (డీఎఫ్‌జీసీ), యునిసెఫ్‌ ఇండియా తమ భాగస్వామ్యాన్ని మరో మూడేళ్లపాటు కొనసాగించనున్నాయి. ఆగస్టు 2026 నుంచి జులై 2029 వరకు కొనసాగే ఈ కార్యక్రమంలో నవజాత శిశువులు, చిన్నారుల వికాసంపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు.

భాగస్వామ్య పునరుద్ధరణ ఒప్పందంపై డీఎఫ్‌జీసీ మేనేజింగ్‌ ట్రస్టీ నీలిమా ప్రసాద్‌ దివి, యునిసెఫ్‌ ఇండియా ప్రతినిధి సింధియా మెక్కాఫ్రీ సంతకాలు చేశారు. చిన్నారుల్లో ఎదుగుదల ఆలస్యాన్ని ముందుగానే గుర్తించడం, అవసరమైన వైద్య, సహాయక సేవలు సకాలంలో అందేలా వ్యవస్థలను పటిష్ఠం చేయడం ఈ దశలో ప్రధాన లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.

2023 నుంచి 2026 వరకు సాగిన తొలి దశలో 20 వేల మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు 50 వేల మంది శిశువైద్యులకు శిక్షణ ఇచ్చినట్లు పేర్కొన్నారు. 2,200 అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషణ, సంరక్షణ సేవలను మెరుగుపరిచామని తెలిపారు. క్లినికల్‌ సేవలు, శిక్షణ, మార్గదర్శకత్వం అందించేందుకు సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయడంతో పాటు ఎదుగుదలలో ఆలస్యం, వైకల్యాలను తొలిదశలోనే గుర్తించేందుకు అవసరమైన విధానాలను రూపొందించినట్లు వివరించారు.

రెండో దశలో సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ను మరింత పటిష్ఠం చేయడంతో పాటు జిల్లా తొలిదశ జోక్య కేంద్రాల (డీఈఐసీ) ద్వారా సేవలను విస్తరించనున్నారు. చిన్నారులతో పాటు వారి కుటుంబాలు, సంరక్షకులకు అవసరమైన సహాయాన్ని పెంచనున్నట్లు తెలిపారు. ప్రతి చిన్నారికి ఎదిగేందుకు అవసరమైన అవకాశాలు అందించడమే తమ లక్ష్యమని నీలిమా ప్రసాద్‌ దివి పేర్కొన్నారు. చిన్నారి జీవితంలో తొలి సంవత్సరాలే భవిష్యత్తు ఎదుగుదలకు పునాది అని, సమస్యలను ముందుగానే గుర్తించి అవసరమైన సేవలు అందించడంపై దృష్టి సారిస్తామని సింధియా మెక్కాఫ్రీ తెలిపారు.