బ్రేకింగ్ న్యూస్
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఘన నివాళితెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళిచిన్నారుల సమగ్ర వికాసానికి మరో ముందడుగుతెలంగాణ సాధనలో జయశంకర్‌ కృషి చిరస్మరణీయంబ్రతుకంతా తెలంగాణకే అంకితంతెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మాకొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!ఓటర్ల జాబితా సవరణపై సర్వపక్ష భేటీజయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలుపసిడి భగ్గుమంది!తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఘన నివాళితెలంగాణ సిద్ధాంతకర్తకు ఘన నివాళిచిన్నారుల సమగ్ర వికాసానికి మరో ముందడుగుతెలంగాణ సాధనలో జయశంకర్‌ కృషి చిరస్మరణీయంబ్రతుకంతా తెలంగాణకే అంకితంతెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మాకొత్త రేషన్‌ కార్డులు వచ్చేస్తున్నాయ్‌!ఓటర్ల జాబితా సవరణపై సర్వపక్ష భేటీజయశంకర్‌ స్ఫూర్తితో ప్రజలకు మెరుగైన సేవలుపసిడి భగ్గుమంది!
తెలంగాణ

తెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మా

తెలంగాణ కోసం పార్లమెంట్‌లో గళమెత్తిన సుష్మా

హఫీజ్‌పేట్‌లో వర్ధంతి సందర్భంగా బీజేపీ నేతల నివాళి

శేరిలింగంపల్లి, ఆగస్టు 6 (సిటీటైమ్స్): ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంట్‌లో మద్దతుగా నిలిచి, తెలంగాణ ప్రజల తరఫున గళమెత్తిన నాయకురాలు సుష్మా స్వరాజ్‌ అని హఫీజ్‌పేట్‌ డివిజన్‌ బీజేపీ అధ్యక్షుడు కైతాపురం జితేందర్‌ అన్నారు. ఆమె వర్ధంతి సందర్భంగా గురువారం హుడా కాలనీలో బీజేపీ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రత్యేక రాష్ట్ర సాధనకు సుష్మా స్వరాజ్‌ అండగా నిలిచారని బీజేపీ నాయకులు గుర్తుచేశారు. ఉద్యమంలో యువతకు ధైర్యం చెప్పారని, తెలంగాణతో ఆమెకు ఉన్న అనుబంధంతోనే ప్రజలు ‘తెలంగాణ చిన్నమ్మ’గా ఆదరించారని పేర్కొన్నారు.

కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్‌ అజిత్‌కుమార్‌ సేనాపతి, సీనియర్‌ నాయకుడు పోరెడ్డి బుచ్చిరెడ్డి, మాజీ కౌన్సిలర్‌ రమణయ్య, రవిగౌడ్‌, ఆళ్ల వరప్రసాద్‌, సత్యనారాయణరాజు తదితరులు పాల్గొన్నారు.