బ్రేకింగ్ న్యూస్
తనిఖీల్లో తేలిన నిర్లక్ష్యంఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఫిర్యాదుల లెక్కలేనా.. పరిష్కారాల లెక్కలేదా?హైకోర్టు సీరియస్ – సంధ్యా లేఔట్ ఆక్రమణలపై హైడ్రా ఝలక్ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో 20 మంది మృతిదేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజచదువులో ముందు… గుర్తింపులో వెనుక!ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షమవుతున్న చంద్రగ్రహణంచిరు–నయన్ లవ్ ట్రాక్ రెడీ… ‘మన శంకర వర ప్రసాద్’ తో తెరపై రొమాన్స్ బ్లాస్ట్!తనిఖీల్లో తేలిన నిర్లక్ష్యంఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఫిర్యాదుల లెక్కలేనా.. పరిష్కారాల లెక్కలేదా?హైకోర్టు సీరియస్ – సంధ్యా లేఔట్ ఆక్రమణలపై హైడ్రా ఝలక్ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో 20 మంది మృతిదేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజచదువులో ముందు… గుర్తింపులో వెనుక!ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షమవుతున్న చంద్రగ్రహణంచిరు–నయన్ లవ్ ట్రాక్ రెడీ… ‘మన శంకర వర ప్రసాద్’ తో తెరపై రొమాన్స్ బ్లాస్ట్!
తెలంగాణ

పింఛన్ల పెంపు హామీ నిలబెట్టకపోతే ఉద్యమం తీవ్రం చేస్తాం: మంద కృష్ణ మాదిగ

సంగారెడ్డి, సెప్టెంబర్ 7 (సిటీటైమ్స్): ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వ పింఛన్ల పెంపును తక్షణమే అమలు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కొల్లూరులో వెలిమెల ప్రమోద్ ఆధ్వర్యంలో జరిగిన “చల్లో కొల్లూరు – మహా గర్జన” సభలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక 21 నెలలు గడిచినా ఇప్పటి వరకు హామీలు అమలు కాలేదని విమర్శించారు. దివ్యాంగులకు రూ.6,000, వృద్ధులు, వితంతువులు, నిరాశ్రయ మహిళలు, ఒంటరి మహిళలకు రూ.4,000 పింఛన్ అందిస్తామని మేనిఫెస్టోలో ప్రకటించిన మాటను నిలబెట్టుకోవాలని గుర్తు చేశారు. అప్పటి నుంచి దాదాపు 10 లక్షల కొత్త దరఖాస్తుదారులు చేరారని, వీరికి కూడా లబ్ధి చేకూరాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9, 2023 నుంచి పెరిగిన పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా హామీ ఇచ్చినా అమలు కాలేదని ఘాటుగా విమర్శించారు. ప్రతిపక్షాలు కూడా నిర్లక్ష్యం చూపుతున్నాయని మండిపడ్డ ఆయన, పింఛన్లపై ఆధారపడే 55 లక్షల పేద కుటుంబాల విశ్వాసాన్ని మోసం చేశారని అన్నారు. ఇకపై ఆందోళనలను తీవ్రతరం చేస్తామంటూ హెచ్చరిస్తూ, 33 జిల్లాల్లో ధర్నాలు, రాబోయే రోజుల్లో హైదరాబాద్-విజయవాడ రహదారి దిగ్బంధం చేపడతామని ప్రకటించారు. ఈ మహాగర్జనలో తెలంగాణ అంతటినుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో కొల్లూరు గ్రామ అధ్యక్షుడు వై.ప్రమోద్ మాదిగ, ఎంఆర్పీఎస్ ఇన్‌చార్జ్ వీఎస్ రాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.