బ్రేకింగ్ న్యూస్
తనిఖీల్లో తేలిన నిర్లక్ష్యంఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఫిర్యాదుల లెక్కలేనా.. పరిష్కారాల లెక్కలేదా?హైకోర్టు సీరియస్ – సంధ్యా లేఔట్ ఆక్రమణలపై హైడ్రా ఝలక్ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో 20 మంది మృతిదేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజచదువులో ముందు… గుర్తింపులో వెనుక!ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షమవుతున్న చంద్రగ్రహణంచిరు–నయన్ లవ్ ట్రాక్ రెడీ… ‘మన శంకర వర ప్రసాద్’ తో తెరపై రొమాన్స్ బ్లాస్ట్!తనిఖీల్లో తేలిన నిర్లక్ష్యంఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఫిర్యాదుల లెక్కలేనా.. పరిష్కారాల లెక్కలేదా?హైకోర్టు సీరియస్ – సంధ్యా లేఔట్ ఆక్రమణలపై హైడ్రా ఝలక్ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో 20 మంది మృతిదేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజచదువులో ముందు… గుర్తింపులో వెనుక!ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షమవుతున్న చంద్రగ్రహణంచిరు–నయన్ లవ్ ట్రాక్ రెడీ… ‘మన శంకర వర ప్రసాద్’ తో తెరపై రొమాన్స్ బ్లాస్ట్!
తెలంగాణ

హైకోర్టు సీరియస్ – సంధ్యా లేఔట్ ఆక్రమణలపై హైడ్రా ఝలక్

గచ్చిబౌలి ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో సంధ్యా కన్వెన్షన్ యజమాని సంధ్యా శ్రీధరరావు చేసిన రహదారి, పార్కుల ఆక్రమణలపై హైకోర్టు ఇటీవల తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేయడంతో హైడ్రా సోమవారం ఉదయం నేరుగా క్షేత్రస్థాయికి దూసుకెళ్లి అనుమతులేని నిర్మాణాలన్నీ కూల్చివేసింది. 20 ఎకరాల లేఔట్‌లో 162 ప్లాట్లు ఉన్నా వాటిలో పెద్ద భాగం తనవేనన్న ధోరణితో సరిహద్దులు చెరిపి ఇష్టానుసారం నిర్మాణాలు చేశారని ప్లాట్ యజమానులు కోర్టుకు విన్నవించగా, అడిగితే దాడులు, బెదిరింపులు, తప్పుడు కేసులు పెట్టారని కూడా ఫిర్యాదు చేశారు. సుప్రీంకోర్టు విధించిన రూ.10 లక్షల జరిమానా విషయం గుర్తుచేసిన బాధితుల వాదనలు విన్న హైకోర్టు “లేఔట్ అంటే లేఔటే… రహదారులు ఎవరికి వ్యక్తిగత ఆస్తి కావు” అంటూ హైడ్రాకు వెంటనే పునరుద్ధరణ ఆదేశాలిచ్చింది. దీనిపై హైడ్రా ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి రహదారులపై వేసిన షెడ్లు, సరిహద్దులు దాటి కట్టిన నిర్మాణాలను నిమిషాల్లో నేలమట్టం చేసింది.