బ్రేకింగ్ న్యూస్
తనిఖీల్లో తేలిన నిర్లక్ష్యంఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఫిర్యాదుల లెక్కలేనా.. పరిష్కారాల లెక్కలేదా?హైకోర్టు సీరియస్ – సంధ్యా లేఔట్ ఆక్రమణలపై హైడ్రా ఝలక్ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో 20 మంది మృతిదేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజచదువులో ముందు… గుర్తింపులో వెనుక!ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షమవుతున్న చంద్రగ్రహణంచిరు–నయన్ లవ్ ట్రాక్ రెడీ… ‘మన శంకర వర ప్రసాద్’ తో తెరపై రొమాన్స్ బ్లాస్ట్!తనిఖీల్లో తేలిన నిర్లక్ష్యంఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఖాతాలు ఎక్కువైనా.. ఒకే లెక్కఫిర్యాదుల లెక్కలేనా.. పరిష్కారాల లెక్కలేదా?హైకోర్టు సీరియస్ – సంధ్యా లేఔట్ ఆక్రమణలపై హైడ్రా ఝలక్ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో 20 మంది మృతిదేశంలో జర్నలిస్టుల హక్కుల సాధనలో ఎన్‌యూజె(ఐ) ముందంజచదువులో ముందు… గుర్తింపులో వెనుక!ప్రపంచవ్యాప్తంగా ప్రత్యక్షమవుతున్న చంద్రగ్రహణంచిరు–నయన్ లవ్ ట్రాక్ రెడీ… ‘మన శంకర వర ప్రసాద్’ తో తెరపై రొమాన్స్ బ్లాస్ట్!
తెలంగాణ

ఘోర రోడ్డు ప్రమాదం.. చేవెళ్లలో 20 మంది మృతి

రంగారెడ్డి, నవంబర్ 3 (సిటీటైమ్స్):
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో సోమవారం ఉదయం హైదరాబాద్–బీజాపూర్ జాతీయ రహదారి రక్తమోడింది. మీర్జాగూడ వద్ద ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొనడంతో 20 మంది ప్రాణాలు కోల్పోయారు. టిప్పర్ డ్రైవర్‌తో పాటు బస్సులోని 19 మంది అక్కడికక్కడే మృతిచెందగా, పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. తాండూరు నుంచి హైదరాబాద్ వైపు కంకర లోడ్‌తో వస్తున్న టిప్పర్ లారీ, ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. టిప్పర్‌ బస్సు డ్రైవర్ సీటు వైపు చీల్చుకుంటూ బోల్తా పడటంతో బస్సు కుడివైపున కూర్చున్న ప్రయాణికులపై కంకర కుప్పకూలింది. దాదాపు 15 నుంచి 20 టన్నుల కంకర పూర్తిగా బస్సులోకి దూసుకెళ్లడంతో ప్రయాణికులు కంకరలో కూరుకుపోయారు. దీంతో మృతుల సంఖ్య పెరిగినట్లు పోలీసులు తెలిపారు.

బస్సు ఎడమ వైపున కూర్చున్న కొందరు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్‌లు జేసీబీల సాయంతో కంకర తొలగించి గాయపడిన వారిని బయటకు తీశారు. మృతుల్లో ఎక్కువగా మహిళలే ఉన్నట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని, గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని సీఎస్‌, డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంపై పూర్తి వివరాలు తక్షణం నివేదించాలని అధికారులను ఆదేశించారు.