బ్రేకింగ్ న్యూస్
భౌరంపేట్‌లో రోడ్లు.. డ్రైనేజీ.. ట్రాఫిక్‌పై దృష్టికొరియర్‌ అంటూ ఇంట్లోకి.. పెప్పర్‌ స్ప్రేతో మంగళసూత్రం చోరీ!ఐకియా జంక్షన్‌లో ట్రాఫిక్‌పై నజర్‌నడిగడ్డ తాండలో సమస్యలు పరిష్కరించండిఫైర్‌ ఎన్‌వోసీల్లో ఫోర్జరీ.. హైడ్రా సీరియస్‌ఎస్సీ, ఎస్టీల సంక్షేమం.. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిబాలికల కళాశాలకు 9,792 నోట్‌బుక్కులుబోనాల నిర్వహణకు 92 ఆలయాలకు రూ.30.71 లక్షలుప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలుభౌరంపేట్‌లో రోడ్లు.. డ్రైనేజీ.. ట్రాఫిక్‌పై దృష్టికొరియర్‌ అంటూ ఇంట్లోకి.. పెప్పర్‌ స్ప్రేతో మంగళసూత్రం చోరీ!ఐకియా జంక్షన్‌లో ట్రాఫిక్‌పై నజర్‌నడిగడ్డ తాండలో సమస్యలు పరిష్కరించండిఫైర్‌ ఎన్‌వోసీల్లో ఫోర్జరీ.. హైడ్రా సీరియస్‌ఎస్సీ, ఎస్టీల సంక్షేమం.. అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిబాలికల కళాశాలకు 9,792 నోట్‌బుక్కులుబోనాల నిర్వహణకు 92 ఆలయాలకు రూ.30.71 లక్షలుప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు ఉచిత నోట్ పుస్తకాలు
తెలంగాణ

సామాజిక న్యాయానికి ప్రతీక సర్వాయి పాపన్న: జగదీశ్వర్‌గౌడ్

శేరిలింగంపల్లి, ఆగస్టు 5 (సిటీటైమ్స్): ప్రజల స్వాభిమానం, ధైర్యం, సామాజిక న్యాయం, అణగారిన వర్గాల ఆత్మగౌరవానికి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చిరస్మరణీయ ప్రతీక అని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ ఇన్‌ఛార్జి వి.జగదీశ్వర్‌గౌడ్ అన్నారు.

రాయదుర్గంలో గౌడ్ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఏఐసీసీ నాయకుడు మధుయాష్కిగౌడ్, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్, మాజీ కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్‌గౌడ్, అశోక్‌గౌడ్‌తో కలిసి ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జగదీశ్వర్‌గౌడ్ మాట్లాడుతూ.. అధికారం కోసం కాకుండా ప్రజల హక్కుల పరిరక్షణ కోసం పాపన్న పోరాడారని పేర్కొన్నారు. అన్యాయాన్ని ఎదిరించి, అణచివేతకు వ్యతిరేకంగా నిలిచిన ఆయన జీవితం తెలంగాణ సమాజానికి స్ఫూర్తిదాయకమన్నారు. మరుగునపడిన మహనీయులకు గుర్తింపు కల్పిస్తూ వారి చరిత్రను భావితరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోందన్నారు. పాపన్న ఆశయాలను ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం, సమానత్వం కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గౌడ్ సంఘం ప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.