Breaking News

తిరుపతిలో శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభం

తిరుపతి, సెప్టెంబర్ 28: అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయంలో భక్తి శ్రద్ధలతో విశేష పూజలు నిర్వహించారు.

ఉదయం స్వామివారిని వేద మంత్రాలతో మేల్కొలిపి, తోమాల సేవ, అర్చన నిర్వహించారు. అనంతరం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పవిత్ర ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ క్రతువుల తర్వాత, శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, పసుపు, చందనంతో స్వామివారిని అభిషేకించారు. సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు కొనసాగాయి.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈవో శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీ శ్రీవాణి, కంకణ బట్టర్ శ్రీ సూర్య కుమార్ ఆచార్యులు, టెంపుల్ ఇన్స్‌పెక్టర్ శ్రీ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

#తిరుపతి #ప్రసన్నవేంకటేశ్వరస్వామి #పవిత్రోత్సవాలు #టీటీడీ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *