ఘనంగా సన్మానించిన డీన్ .
పంజాగుట్ట, సిటీ టైమ్స్ : నిమ్స్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తున్న పలువురు ఉద్యోగులు బుధవారం పదవీ విరమణ చేశారు.ఆసుపత్రి మొదటి అంతస్థులోని లెర్నింగ్ సెంటర్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో ఆసుపత్రి డీన్ లిజా రాజశేఖర్ వారిని ఘనంగా సత్కరించి, వారు ఆసుపత్రికి అందించిన సేవాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ రిజిస్ట్రార్ డా. శాంతివీర్ గారు, లైసీనింగ్ ఆఫీసర్ ఏ. రాంబాబు, రాజ్ కుమార్ శ్రీనివాసులు,నర్సింగ్ యూనియన్ నుంచి విజయ కుమారి,వివిధ ఉద్యోగుల సంఘ నాయకులు , ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని పదవీ విరమణ చేస్తున్నటువంటి తోటి ఉద్యోగులను ఘనంగా సన్మానించారు.
