Breaking News

ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా – హైడ్రా, ప్రభుత్వ తీరు మారడం లేదు: బండి సంజయ్

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం “హైడ్రా” పేరిట పేదల బతుకులతో ఆటలాడుతోందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఇటీవలే ఎఫ్‌టీఎల్ మరియు బఫర్ జోన్ల పరిధిలోని ఇళ్లను కూల్చిన ప్రభుత్వం, ఇప్పుడు మూసీ ప్రక్షాళన పేరుతో ఆ నది పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను కూల్చేందుకు కుట్ర పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.బీజేపీ నేతలు తమ పార్టీ అండగా ఉంటారని, కూల్చివేతల ప్రక్రియలో దాటిన తర్వాతే ప్రభుత్వం ముందుకు వెళ్లాలని హెచ్చరించారు. హైడ్రా విషయములో ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో నరేంద్ర మోదీ ఫొటో ఎగ్జిబిషన్ లో పాల్గొన్న బండి సంజయ్, మోదీ దేశానికి చేసిన సేవలను తెలియజేయడానికి ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అక్టోబర్ 2 మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా స్వేచ్ఛ సేవా అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు.

తెలంగాణలో ప్రజలు హైడ్రా కూల్చివేతల వల్ల ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. గ్రామాలలోని సర్పంచ్ లకు, ఎంపీటీసీలకు చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. గ్రామ పంచాయతీల విషయంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేస్తుందంటే, కాంగ్రెస్ కూడా అదే స్థాయిలో మోసం చేస్తోందన్నారు.హైడ్రా వల్ల పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం పక్కన పెట్టారని అన్నారు. అన్ని రకాల అనుమతులు ఉన్నప్పటికీ పేదల ఇండ్లను కూల్చడం సమర్థించదని పేర్కొన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా అక్టోబర్ 2 వరకు కార్యక్రమాలు జరుపుతామని, ఈ సందర్భంగా రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంపులు నిర్వహించామని రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు.

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.