Breaking News

రాజమౌళితో కలసి పని చేయాలనే ఆశ: అశ్వనీదత్

హైదరాబాద్: ‘కల్కి 2898 ఏడీ’ సినిమాతో భారీ విజయం అందుకున్న ప్రొడ్యూసర్ అశ్వనీదత్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన మనసులోని మాట బయటపెట్టారు. దర్శకధీరుడు రాజమౌళితో సినిమా చేయాలని ఉందని చెప్పారు.

‘స్టూడెంట్ నం 1′ సినిమాకు నేను ప్రజంటర్‌గా వ్యవహరించా. అది తొలి చిత్రమే అయినప్పటికీ ఆయన అద్భుతంగా తెరకెక్కించారు. ఇప్పుడు ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. తనతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా. కాకపోతే కుదరడం లేదు. ఇప్పటికీ చేయాలని ఉంది’ అని అశ్వనీదత్‌ తెలిపారు.

కాగా, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లీడ్ రోల్లో తెరకెక్కిన ‘కల్కి’ సినిమా జూన్ 27న రిలీజై బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకుంది. ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా రూ. 1150 కోట్ల వసూళ్లు వచ్చాయి. అయితే ఈ సినిమా బడ్జెట్ విషయంలో మాత్రం తాను ఎలాంటి షరతులు పెట్టలేదని అన్నారు.