శేరిలింగంపల్లి, సిటీటైమ్స్:
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ మెట్రో స్టేషన్ కల్వరి టెంపుల్ రోడ్డు లో బుధవారం మియాపూర్ పోలీసులు, ఎస్వోటీ (స్పెషల్ ఆపరేషన్ టీమ్) పోలీసులు గంజాయిని గుర్తించారు. మహీంద్రా కారులో దాదాపుగా 21 కిలోల గంజాయిని ఒరిసా నుండి హైదరాబాద్ కి తరలిస్తుండగా పట్టుకున్నారు . నలుగురు నిందితులు అందులో ఒరిసాకు చెందిన కీలక నిందితుడితో పాటు అతని అనుచరులు ఇద్దరు, హైదరాబాదుకు చెందిన ఒక్కరిని గుర్తించారు. కారుతో పాటు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.

